టెస్ట్ జట్టులో ఇద్దరు తెలుగోళ్లకు చోటు.. ఇంగ్లండ్ టూర్‌కి సెలక్టర్ల ఎంపిక
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హనుమ విహారీతో పాటు శ్రీకర్ భరత్‌కు చోటు దక్కడంపై తెలుగు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకర్ భరత్, హనుమ విహారీది ఒకే ప్రాంతం కావడం విశేషం. వీరిద్దరూ పాత తూర్పుగోదావరి జిల్లా వాసులే. హనుమ విహారి కాకినాడ కాగా.. కోన శ్రీకర్ భరత్‌ది కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం. ఇప్పటివరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హనుమ విహారి ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 808 పరుగులు చేశాడు. శ్రీకర్ భరత్ ఇప్పటి వరకూ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్ సిరీస్‌కి తీసుకున్నా బెంచ్‌కే పరిమితమయ్యాడు.
© 2025 Copyright by Andhra Cricket Association All rights reserved.